MLC Kavitha | సికింద్రాబాద్, ఏప్రిల్ 8 : లష్కర్ జిల్లా సాధనకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. మంగళవారం లష్కర్ జిల్లా సాధన సమితి ప్రతినిధుల బృందం బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ప్రజలకు పాలనను మరింత చేరువలో తీసుకుపోవడానికి ఆనాడు కేసీఆర్ రాష్టంలో పలు జిల్లాలను ఏర్పాటు చేశారని ఆమె గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తప్పకుండ సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తానని కవిత హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడంతో పాటు వచ్చే అసెంబ్లీ సమావేశంలో కౌన్సిల్లో ఈ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని కవిత లష్కర్ సాధన సమితి ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సాధం బాలరాజ్ యాదవ్, శైలందర్, సునీల్ ముదిరాజ్, శ్రీకాంత్ రెడ్డి, అశోక్ చారి, కృష్ణ ముదిరాజ్‌లు పాల్గొన్నారు.