వెంగళరావునగర్, జూలై 16 : సాఫ్ట్వేర్ అఫీస్లో(Software office) ల్యాప్ టాప్లు చోరీకి(Laptops stolen) గురైన ఘటన పై మధురానగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డిగూడకు చెందిన పి.రాజశేఖర్ గత రెండేళ్లుగా పొసినా టెక్నాలజీస్ అనే స్టార్టప్ కంపెనీని నిర్వహి స్తున్నారు. కాగా, ఓ గుర్తు తెలియని వ్యక్తి స్టార్టప్ కంపెనీలోకి జొరబడి 3వ అంతస్తుపైకి వెళ్లాడు.
అక్కడి వారు ప్రశ్నించగా..తాను మూగ వాడినంటూ చేతి పై రాసి చూపించాడు. అక్కడున్న వారు అతన్ని బయటకు పంపగా..రెండో అంతస్తు దిగాడు. తలుపు దగ్గరు బల్ల పై ఉన్న 2 ల్యాప్ టాప్లను అపహరించి పరారయ్యాడు. చోరీకి పాల్పడ్డ వ్యక్తికి 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోద చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.