కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 8: బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు కోరారు. మంగళవారం కూకట్పల్లి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు సైనికుల్లా కదిలొచ్చి విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీశ్ ఆరోరా, కార్పొరేటర్లు నరసింహ యాదవ్, శ్రీనివాసరావు, శిరీషాబాబురావు, సత్యనారాయణ, సతీశ్, రవీందర్ రెడ్డి, సబియా బేగం, శ్రీహరి, మాజీ కార్పొరేటర్లు శ్రావణ్ కుమార్,బాబురావు, మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు గౌసుద్దీన్ పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలతో ఎమ్మెల్యే కృష్ణారావు సమావేశం నిర్వహించారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కష్టపడి పనిచేసే నాయకులు.. కార్యకర్తలకు భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సాయిబాబా, రంగారావు, నాయకులు సతీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, హరీశ్‌రావు, రోజా, రామకృష్ణ పాల్గొన్నారు.