హైదరాబాద్: రాజకీయాల్లో గెలుపోటములు సహజమని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కుటుంబ సభ్యులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ (KTR) ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందన్నారు. మాగంటి సునీత గోపీనాథ్ నివాసానికి వెళ్లిన కేటీఆర్.. వారి కుటుంబ సభ్యులను కలిశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు, అక్రమాలు చేసినా.. వాటిని ఎదుర్కొని నిలబడి గట్టి పోటీ ఇచ్చిన సునీత గోపీనాథ్‌ను, వారి పిల్లలు చూపిన స్ఫూర్తిని, పోరాటాన్ని అభినందించారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని కేటీఆర్ ధైర్యం చెప్పారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు, అక్రమాలు చేసినా.. వాటిని ఎదుర్కొని… pic.twitter.com/TtsbKrXf5k
— BRS Party (@BRSparty) November 15, 2025