సిటీబ్యూరో, నవంబరు 7 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఎన్నికల జోష్ నింపేందుకు మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటనకు రూట్ మ్యాప్ ఖరారైంది. ఈ నెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ 15 నియోజకవర్గాల్లో రోడ్ షో చేపట్టనున్నారు.
గత ఎన్నికల సమయంలో, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో అనుసరించిన ప్రచార వ్యూహాన్నే ఈ ఎన్నికల్లోనూ మంత్రి కేటీఆర్ అమలు చేయనున్నారు. 15 నియోజకవర్గాల్లో రోడ్‌షోలతో పాటు ఈ నెల 25వ తేదీన సీఎం కేసీఆర్ బహిరంగసభను నిర్వహించనున్నారు. వీటితోపాటు హైదరాబాద్ సహా పలు నియోజకవర్గాల్లోని వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించనున్నారు.
తేదీ – నియోజకవర్గాలు
15 – కుత్బుల్లాపూర్, కూకట్పల్లి
16 – అంబర్‌పేట, ముషీరాబాద్
17 – గోషామహల్, సికింద్రాబాద్
18 – జూబ్లీహిల్స్, ఖైరతాబాద్
19 – సనత్‌నగర్, కంటోన్మెంట్
20 – ఎల్బీ నగర్
21 – శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్
22 – మల్కాజ్గిరి, ఉప్పల్
25 – సీఎం కేసీఆర్ బహిరంగ సభ