KTR | మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియలో అధికార కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న అరాచకాలు, కుట్రల నేపథ్యంలో బీఆర్ఎస్ అప్రమత్తమైంది. రేపు ఎన్నికలు జరగనున్న కీలకమైన హంగ్ మున్సిపాలిటీల కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా ఎన్నికల ఇంఛార్జిలను నియమించారు. ఈ మేరకు కేటీఆర్ ఆయా మున్సిపాలిటీల స్థానిక నాయకత్వం, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇంఛార్జిలతో స్వయంగా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు.
స్థానికంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమ కిడ్నాప్‌లు, బెదిరింపులు, పోలీసుల దుర్వినియోగం వంటి అంశాలను అడిగి తెలుసుకున్న కేటీఆర్.. పార్టీ స్థానిక నాయకత్వానికి అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ అరాచకాల నేపథ్యంలో స్థానిక నాయకత్వానికి అన్ని విధాలా అండగా నిలబడేందుకు, ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు పార్టీ తరఫున సీనియర్ నాయకులను ప్రత్యేక ఇంఛార్జిలుగా పంపుతున్నట్లు ప్రకటించారు.
కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నేతలు వెంటనే తమకు కేటాయించిన మున్సిపాలిటీలకు బయలుదేరి వెళ్లారు. రేపు ఎన్నికలు జరగనున్న 8 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ స్పష్టంగా ఛైర్మన్ పీఠాలను గెలుచుకునే అవకాశం ఉన్నందున, ఈ ఎన్నికలను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. 8 పట్టణాలకు సీనియర్ నేతలను ఇంఛార్జిలుగా నియమించారు.
మున్సిపాలిటీల వారిగా ఎన్నికల పరిశీలకులు..
తొర్రూర్ : ఎమ్మెల్సీ మధుసూదనాచారి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్
జనగామ : బండ ప్రకాశ్ (శాసన మండలి డిప్యూటీ చైర్మన్), ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
క్యాతన్ పల్లి : ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఖానాపూర్ : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఇంద్రేశం : ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, యాదవ రెడ్డి ఎమ్మెల్సీ
ఇబ్రహీంపట్నం : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
కాగజ్ నగర్ : జోగురామన్న
జహీరాబాద్ : ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
Peddapalli | కోరం లేక వాయిదా పడ్డ సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నిక
‘ఎంజీయూ విద్యార్థులకు కనీస వైద్య సదుపాయాలు కరువు’