HYDRAA | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై మహిళలు నిప్పులు చెరుగుతున్నారు. ఇందిరా గాంధీ భూములిస్తే.. రేవంత్ రెడ్డి లాక్కుంటున్నాడని మండిపడ్డారు. కొండాపూర్‌లోని భిక్షపతి నగర్లో పేదలకు సంబంధించిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడంతో.. రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూముల దందా చేసుకుని బతికే దొంగ రేవంత్ రెడ్డి అంటూ ఓ మహిళ మండిపడింది. రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండ వస్తే ఇక్కడనే పండబెట్టి తొక్కుతం అని హెచ్చరించింది. కేసీఆర్ మా చెలకల జోలికి ఎన్నడు రాలేదు అని మరో మహిళ పేర్కొంది. తులం బంగారం లేదు.. 2500 ఇవ్వలేదు.. పెన్షన్లు లేవు.. కరెంట్ బిల్లులు మాఫీ కాలేదు కానీ.. మా భూముల మీద రేవంత్ రెడ్డి పడిండు అని మరో మహిళ ధ్వజమెత్తింది.
మరో వృద్ధురాలు మాట్లాడుతూ.. మా నాన్న పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటే ఇందిరా గాంధీ మాకు ఈ భూములు ఇచ్చిందని తెలిపింది. అప్పటి నుండి మమ్మల్ని ఎవరూ ఏం అనలేదు. రేవంత్ రెడ్డి వచ్చి మా భూముల మీద పడ్డాడు. హైడ్రా కూల్చివేతల్లో ఇల్లు పోగొట్టుకున్నానని ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
భూముల దందా చేసుకుని బతికే దొంగ రేవంత్ రెడ్డి వాడు
రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండ వస్తే ఇక్కడనే పండబెట్టి తొక్కుతం
కేసీఆర్ మా చెలకల జోలికి ఎన్నడు రాలేదు https://t.co/nEHx2L9njA pic.twitter.com/gajidnIuTs
— Telugu Scribe (@TeluguScribe) October 4, 2025
మా నాన్న పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటే ఇందిరా గాంధీ ఇచ్చింది మాకు ఈ భూములు
అప్పటి నుండి మమ్మల్ని ఎవరూ ఏం అనలేదు
రేవంత్ రెడ్డి వచ్చి మా భూముల మీద పడ్డాడు
హైడ్రా కూల్చివేతల్లో ఇల్లు పోగొట్టుకున్న వృద్ధురాలి ఆవేదన https://t.co/JQR1QaM1NW pic.twitter.com/hWtZmsaGWW
— Telugu Scribe (@TeluguScribe) October 4, 2025