మెహిదీపట్నం,జూలై 10ః చారిత్రాత్మక గోల్కొండ కోటలో జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో జరిగే ఆషాఢ మాసం బోనాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ,బాధ్యతతో పనిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం గోల్కొండ కోటలో ప్రభుత్వ శాఖల అధికారులతో గోల్కొండ బోనాల ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోల్కొండ బోనాలకు ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉందని,ఈ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పోలీస్, ట్రాఫిక్, విద్యుత్,జీహెచ్ఎంసీ,ఆగ్నిమాపక.జలమండలి, వైద్య,పురావస్తు,ఆర్అండ్బి,ఆర్టీసి,సాంస్కృతిక ,పారిశుద్ధ్య విభాగాల అధికారులు బోనాలకు కావాల్సిన అన్నీ ఏర్పాట్లు ఎలాంటి లోటు పాట్లు లేకుండా చేపట్టాలని ఆదేశించారు.