Konda Surekha| కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారని తెలిసిందే. నా దేవాదాయ శాఖలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి జోక్యం సరికాదు. నాకు సమాచారం ఇవ్వకుండా అధికారులతో కడియం శ్రీహరి సమీక్ష జరిపారని మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
దీనిపై కడియం స్పందిస్తూ.. కొండా సురేఖది అవగాహన లోపమని… అధికారులు నా దగ్గరికి వస్తే సమీక్ష అంటారు.. నేను అధికారుల దగ్గరికి వెళ్తే సమీక్ష అనరని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడకూడదు అని చెప్పే మంత్రిని మొదటిసారి చూస్తున్నానన్నారు కడియం శ్రీహరి. కొంతమంది అభివృద్ధి గురించి పట్టించుకోకుండా వివాదాలతో వార్తల్లో ఉండాలని చూస్తున్నారని కడియం శ్రీహరి మండిపడ్డారు.
కాగా మంత్రి కొండా సురేఖ మరోసారి కడియంపై విరుచుకపడ్డారు. మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. కడియం శ్రీహరి దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి.. లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి ఇంట్లో పడుకోవాలని మంత్రి కొండా సురేఖ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవిలో ఇమడలేకపోతే రాజకీయాలకు రాజీనామా చేయాలన్నారు.
కడియం శ్రీహరి వచ్చాకే కాంగ్రెస్ పార్టీలో వివాదాలు మొదలయ్యాయని..40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి కడియం సాధారణ ఎమ్మెల్యే పదవిలో ఉండలేకపోతున్నాడని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఎమ్మెల్యే పదవిలో ఇమడలేకపోతే దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి ఇంట్లో పడుకోండని కడియంకు హితవు పలికారు.
కడియం శ్రీహరికి అంత నిజాయితీ ఉంటే రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిశాను. 14వ తేదీన మీనాక్షి నటరాజన్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
కడియం శ్రీహరి దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి
లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి ఇంట్లో పడుకో
కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవిలో ఇమడలేకపోతే రాజకీయాలకు రాజీనామా చేయాలి
కడియం శ్రీహరి వచ్చాకే కాంగ్రెస్ పార్టీలో వివాదాలు మొదలయ్యాయి
40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి, సాధారణ… https://t.co/vKsK4mcKAU pic.twitter.com/ojjUtk1VJp
— Telugu Scribe (@TeluguScribe) July 9, 2026