చిక్కడపల్లి, ఫిబ్రవరి 22 : కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. శనివారం రాంనగర్ డివిజన్ శ్రీరామ్ నగర్ బస్తీలోని కమిటీ హాల్లో.. రూపుల వసంతా దయానంద్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ రాజశ్రీ వివేక్, రామంతపూర్ మెడి ఐ కేర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఠా గోపాల్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీ ఇచ్చిన పథకాలతో పాటు,, ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక పథకాలను అమలు చేశారని గుర్తుచేశారు. అందులో కంటి వెలుగు లాంటి పథకం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని తెలిపారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదని విమర్శించారు.
ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించిన నిర్వాహకులను ఈ సందర్భంగా ముఠా గోపాల్ అభినందించారు. డాక్టర్ ప్రసన్నకుమార్, డాక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ వైద్య శిబిరంలో భాగంగా వంద మందికిపైగా రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్ళజోళ్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు అర్, వివేక్. శ్రీరామ్‌నగర్ బస్తీ వాసులు వాసులు పాల్గొన్నారు.