వెంగళరావునగర్, అక్టోబర్ 22: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన అభివృద్ధే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ విజయానికి నాంది అవుతుందని ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి అన్నారు. బుధవారం సోమాజిగూడ డివిజన్లోని ఎల్లారెడ్డిగూడలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి , జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పీ విష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి మాగంటి సునీతా గోపీనాథ్‌ను ఓటర్లు గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్థన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం తథ్యమని పేర్కొన్నారు. పేదలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మాగంటి సునీతను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు హేమ, శ్యామల, మహేష్‌యాదవ్, శైజన్, శేఖర్, దేవేందర్‌రెడ్డి, ప్రభుదాస్, బూత్ ఇన్చార్జిలు, కోఆర్డినేటర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.