సిటీబ్యూరో : బీఆర్ఎస్ ఏర్పడి 25 వసంతాలు పూర్తి కావస్తున్న సందర్భంగా రజతోత్సవ సన్నాహక సమావేశాలు నియోజకవర్గాల వారీగా నిర్వహించేందుకు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సన్నద్ధ్దమయ్యారు. జిల్లాల అధ్యక్షులు మాగంటి గోపీనాథ్, శంభీపూర్ రాజు, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి,అధ్యక్షతన ఆయా జిల్లాలలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు.
ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రులు, మూడు జిల్లాల అధ్యక్షులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, సుధీర్‌రెడ్డి, ముఠా గోపాల్, మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీలు నవీన్‌రావు, సురభి వాణీదేవి, శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కొప్పుల మహేశ్ రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్, పైలెట్ రోహిత్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పటోళ్ల కార్తీక్ రెడ్డి, మన్నె గోవర్థన్ రెడ్డి, జయసింహ, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మన్నె క్రిశాంక్, గజ్జెల నగేశ్, నివేదిత సాయన్న, పంజుగుల శ్రీశైల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం గురించి కేసీఆర్ వాకబు చేశారు. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నానని గోపీనాథ్ తెలిపారు.