కేసీఆర్ సర్కార్ సంకల్పం
విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం.. సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా.. ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా కేసీఆర్ సర్కార్ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ)ను తీసుకొచ్చింది. రూ.5,937కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ 42 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 37 చోట్ల ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపగా.. పురోగతిలో ఉన్న పనులను తుది దశకు చేర్చి ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తున్నది.
- ఇదిగో ఎస్ఆర్డీపీ ఫలం! ప్రారంభానికి సంతోష్‌నగర్ స్టీల్ బ్రిడ్జి సిద్ధం
- సిగ్నల్ రహిత ప్రయాణం ఎస్ఆర్డీపీ పథకంతో మారిన నగర రవాణా వ్యవస్థ
- ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్న ప్రాజెక్టులు
- వంతెన రాకతో తగ్గనున్న ప్రయాణ సమయం
విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం.. సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా.. ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా కేసీఆర్ సర్కార్ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ)ను తీసుకొచ్చింది. రూ.5,937కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ 42 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 37 చోట్ల ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపగా.. పురోగతిలో ఉన్న పనులను తుది దశకు చేర్చి ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇందులో భాగంగానే నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాలైన సంతోష్ నగర్, చంచల్‌గూడ, సైదాబాద్ మీదుగా ప్రయాణించే లక్షలాది మంది వాహనదారులకు త్వరలోనే ట్రాఫిక్ నరకం నుంచి విముక్తి కలిగించే సంతోష్‌నగర్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే కేవలం ఐదు నిమిషాల్లోనే సులభంగా పూర్తవుతుందని జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ సహదేవ్ రత్నాకర్ తెలిపారు. – సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ)

సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): చంచల్‌గూడ జైలు కూడలి నుంచి సంతోష్‌నగర్ వరకు రూ.620 కోట్ల భారీ వ్యయంతో 3.32 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న మెగా స్టీల్ ఫె్లైఓవర్ను వచ్చే వారంలో ప్రారంభానికి సిద్ధం చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ సహదేవ్ రత్నాకర్ చెప్పారు. రంగులు, వీధి లైట్లు, చివరి దశలోని రా్ంయపు పనులను తుది దశకు చేర్చామని వివరించారు. ఈ ఫె్లైఓవర్ అందుబాటులోకి వస్తే నల్గొండ ఎక్స్ రోడ్స్ నుంచి ఒవైసీ హాస్పిటల్ వరకు ఉన్న మూడు ప్రధాన సిగ్నల్స్ బాధ తప్పనున్నది. తద్వారా 90 శాతం ట్రాఫిక్ సమస్యలు పరిషారం కానున్నాయి. నల్గొండ క్రాస్‌రోడ్డు ఫ్ల్లై ఓవర్ దిగి చంపాపేట్, ఓవైసీ దవాఖాన వద్దనున్న ఇన్నర్ రింగు రోడ్డు చేరుకోవాలంటే సుమారు 3. కి.మీల ప్రయాణం చేయాలి. ఈ మార్గంలో 5 జంక్షన్లు ఉన్నాయి.
మాస్టర్‌ప్లాన్ ప్రకారం రహదారిని వంద అడుగుల మేర విస్తరించాలి. మత విశ్వాసాలతో ముడిపడిన నిర్మాణాలు, పేద, మధ్య తరగతి ప్రజల ఇండ్లు, వ్యాపార కేంద్రాలున్నాయి. దీంతో తక్కువ భూ సేకరణతో స్టీల్ బ్రిడ్జిని బీఆర్ఎస్ ప్రభు త్వం నిర్మాణ పనులు మొదలు పెట్టింది. 30 నిమిషాల ప్రయాణ సమయాన్ని 5 నిమిషాలకు తగ్గించారు. రహదారి మొత్తాన్ని సిగ్నల్ రహితంగా తీర్చిదిద్దుతున్నారు. సైదాబాద్ జంక్షన్లో చంచల్‌గూడ నుంచి చంపాపేట్‌కు వెళ్లే వాహనాలకు ఓ డౌన్ ర్యాంపును, సైదాబాద్ నుంచి జంక్షన్లో ఫ్లై ఓవర్ ఎక్కి చంచల్‌గూడ వైపు వెళ్లేందుకు మరో అప్ ర్యాంపును నిర్మించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

