Free Cool Drinks | మెట్పల్లిలో ఫ్రీగా కూల్‌డ్రింక్స్.. ఒక్కసారిగా ఎగబడిన జనం.. వీడియో వైరల్
Free Cool Drinks | జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఉచితంగా కూల్‌డ్రింక్స్ పంచుతున్నారని తెలియడంతో భారీగా జనం పోటెత్తారు.
Free Cool Drinks | జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఉచితంగా కూల్‌డ్రింక్స్ పంచుతున్నారని తెలియడంతో భారీగా జనం పోటెత్తారు. ఫ్రీ కూల్‌డ్రింక్స్ కోసం వందలాది మంది ఒక్కసారిగా ఎగబడటంతో అక్కడ స్వల్పంగా తోపులాట జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మెట్పల్లి పట్టణంలోని ప్రధాన కూడలిలో ఉచితంగా కూల్‌డ్రింక్స్ పంపిణీ చేస్తున్న విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. మొదట కొద్దిమందితో ప్రారంభమైన పంపిణీ.. కాసేపటికే భారీ జనసందోహంగా మారింది. కూల్‌డ్రింక్స్ తీసుకునేందుకు ఒక్కసారిగా జనం ఎగబడటంతో అక్కడ సందడి నెలకొంది.
జనం సంఖ్య పెరగడంతో కూల్‌డ్రింక్స్ కోసం పోటీ ఏర్పడింది. ఈ క్రమంలో కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడున్న కొందరు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించడంతో అవి సోషల్ మీడియాలోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
అసలు ఎందుకు ఫ్రీగా ఇచ్చారు?
అయితే మెట్పల్లిలో కూల్‌డ్రింక్స్‌ను ఉచితంగా ఎందుకు పంపిణీ చేశారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదైనా కూల్‌డ్రింక్స్ కంపెనీ ప్రమోషన్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారా? లేక మరేదైనా ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా పంపిణీ చేశారా? అనే విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

