రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బస్సుయాత్రకు బుధవారం తెలంగాణ భవన్ నుంచి గులాబీ దళపతి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భవన్లో ఆయనకు మహిళలు బొట్టుపెట్టి.. మంగళహారతులిచ్చారు.
జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో బీఆర్ఎస్ శ్రేణులు హోరెత్తించారు. అనంతరం కేసీఆర్ మిర్యాలగూడకు బయలుదేరారు. దారిపొడవునా.. గులాబీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.