సిటీబ్యూరో: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు గ్రేటర్ వ్యాప్తంగా సోమవారం పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో గ్రేటర్ బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ 71వ పుట్టిన రోజు సందర్భంగా 71 కిలోల భారీ కేక్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, బండ ప్రకాశ్, మహమూద్ అలీ, మాజీ మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ కూకట్పల్లి చిత్తారమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నవీన్‌కుమార్ మొక్కలు నాటారు. అనంతరం బోయిన్పల్లి ప్రాంతంలో పేద మహిళలకు చీరలు, జగద్గిరిగుట్ట ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. బాలానగర్‌లో కేక్ కటింగ్ చేసి వినాయకుని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సీనియర్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, వివేకానంద నగర్ రోజా రంగారావు పాల్గొన్నారు.గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గౌడవెల్లి సాకేత్ భూసత్వలో మాజీ ఎంపీ సంతోష్‌కుమార్, మాజీ మంత్రి మల్లారెడ్డి మొక్కలు నాటారు. నాంపల్లి యూసుఫియాన్ దర్గాలో ఎమ్మెల్సీ మహమూద్ అలీ చాదర్ సమర్పించారు. అలాగే నగరంలోని అన్ని నియోజకవర్గాల్లోని డివిజన్లలో బీఆర్ఎస్ శ్రేణులు కేక్‌ల కటింగ్, పండ్ల పంపిణీ, రక్తదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
వృక్షార్చన..
మేడ్చల్, ఫిబ్రవరి17(నమస్తే తెలంగాణ): గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గౌడవెల్లి సాకేత్ భూసత్వలో మాజీ ఎంపీ సంతోష్‌కుమార్, మాజీ మంత్రి మల్లారెడ్డి మొక్కలు నాటారు. సైకోరియన్ కృషి ఓం అనాథ పిల్లల ఆశ్రమంలో పిల్లల సమక్షంలో మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ కేక్ కట్ చేశారు. పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. సంతోష్‌కుమార్ మల్లారెడ్డి వారితో కలిసి భోజనం చేశారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సైకోరియన్ ఆశ్రమానికి రూ. 2 లక్షల విరాళం అందిస్తానని నిర్వాహకులకు సంతోష్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో మాజీ మేయర్ కావ్య, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ పద్మ జగన్‌రెడ్డి, మేడ్చల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు దయానంద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Kcrbirthday
Kcrbirthday1
Kcrbirthday2
Kcrbirthday3
Kcrbirthday4
Kcrbirthday5
Kcrbirthday6
Kcrbirthday7
Kcrbirthday8
Kcrbirthday9