కందుకూరు, అక్టోబర్ 10 : సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపాలని ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు కార్తీక్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంఆర్ఆర్ రెస్టారెంట్లో జరిగిన మహేశ్వరం, కందుకూరు మండలాల బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం కార్యకర్తల యువ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్తీక్ రెడ్డి హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రతి పక్షాలకు చోటు లేదని చెప్పారు. బీజేపీకి రాష్ట్రంలో రెండు సీట్ల కంటే ఎక్కువ రావని, ఆ పార్టీకి ఓట్లు వేస్తే మురుగు కాల్వలో వేసినట్లేనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి 50 ఏండ్లు అధికారం ఇస్తే ఏం చేసిందని ప్రశ్నించారు. కందుకూరు వరకు మెట్రో రైల్ వస్తున్నదని, మెడికల్ కాలేజీ తీసుకురావడంతో పాటు నియోజకవర్గం అభివృద్ధికి మంత్రి సబితాఇంద్రారెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
మరింత అభివృద్ధి జరుగాలంటే సబితా ఇంద్రారెడ్డిని గెలిపించాలని కోరారు. రెండు నెలలు కష్టపడితే 5సంవత్సరాల పాటు మీ కోసం పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహా రెడ్డి, మేఘనాథ్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు ముద్ద పవణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ల కార్తీక్, మండల యువజన విభాగం అధ్యక్షుడు కొలను విఘ్నేశ్వర్‌రెడ్డి, మర్యాద రాఘవేందర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్‌రెడ్డి, శ్రీధర్ ముదిరాజ్, అజ్జు, దావుద్, ఎగ్గిడి గణేశ్, గొర్రెంకల రామకృష్ణ, ప్రశాంత్‌చారి, రామాంజనేయులు, వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ యువకులు పాల్గొన్నారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సరఫరా పథకం ఫేజ్-2లో గున్గల్ నుంచి సాహేబ్‌నగర్ వరకు ఉన్న 2200 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైన్‌కు రాగన్న గూడ వద్ద భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీని అరికట్టడానికి మరమ్మతు పనులు చేపడుతున్నారు. బుధవారం (నేడు) ఉదయం 6 నుంచి మరుసటి రోజు గురువారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు పలు డివిజన్ల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. మిరాలం, ఎన్పీఏ, బాలాపూర్, మైసారం, బార్కాస్, మేకలమండి, భోలక్‌పూర్, తార్నాక, లాలాపేట్, బౌద్దనగర్, మారేడ్‌పల్లి, కంట్రోల్‌రూం, రైల్వేస్, ఎంఈఎస్, కంటోన్మెంట్, ప్రకాశ్‌నగర్, పాటిగడ్డ, హస్మత్‌పేట్, ఫిరోజ్‌గూడ, గౌతంనగర్, వైశాలినగర్, బీఎన్‌రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కపురి కాలనీ, మహేంద్రహిల్స్, ఏలుగుట్ల, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సీగూడ, చిలుకానగర్, బీరప్పగడ్డ, బుద్వేల్, శాస్త్రిపురం, బోడుప్పల్, మీర్పేట్, బడంగ్పేట్, శంషాబాద్, మన్నెగూడ ప్రాంతాలలో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.