Kandukuru | కందుకూరు, మార్చి 18 : కందుకూరు మండలం అన్ని విడదీస్తే సహించేది లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. ఫోర్త్ సిటీలో తొమ్మిది గ్రామాలను కలుపుకపోవడం సమంజసం కాదని పేర్కొన్నారు. మంగళవారం శ్రీనగర్ కాలనీలోని ఆమె నివాసానికి అఖిలపక్షం నాయకులు వెళ్లి వినతి పత్రం అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కందుకూరు మండలంలో ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి, మండలంలోని 35 గ్రామపంచాయతీలు ఉండగా అందులో 26 గ్రామ పంచాయతీలు కలుపుతూ మిగిలిన తొమ్మిది నేదునూరు, బాచుపల్లి, జైత్వారం, పులిమామిడి, దన్నారం, చిప్పలపల్లి, మురళి నగర్లతోపాటు గిరిజన పంచాయతీలను కలపకపోవడం శోచనీయమన్నారు. మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు కలిసి ఉండాలని విడదీయడం సమంజసం కాదని పేర్కొన్నారు. దీంతో అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఫోర్త్ సిటీ పేరిట రాజకీయం చేయవద్దని సూచించారు. మండలాన్ని విడదీస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. పంతాలు పట్టింపులకు పోకుండా ప్రజల అభీష్టం మేరకు ఆ గ్రామాలను విలీనం చేయాలని సూచించారు.
కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు కాసులు రామకృష్ణారెడ్డి, యాలాల శ్రీనివాస్, బుడొల్ల శ్రీనివాస్, సర్గారి బాల్ రెడ్డి, అంకగాళ్ల కుమార్, ఆనేగౌనీ దామోదర్ గౌడ్, పిట్టల పాండు, ఎగిడి శెట్టి నరేష్, ఉన్ని వెంకటయ్య, కొంతం లింగారెడ్డి, రూప్ చందర్, రాకేష్ గౌడ్, ఢిల్లీ శ్రీధర్ ముదిరాజ్, సురేశ్, వెంకటేష్, బావిరెడ్డి, నరసింహ, పడమటి శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, చంద్రారెడ్డి, గణేష్, మనోహర్‌తో పాటు ఆయ యా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.