జూబ్లీహిల్స్,అక్టోబర్24: జూబ్లీహిల్స్ ఓటర్లు 4,01,365 మందిగా తేలారు. అందులో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు, 25 మంది ఇతరులు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, డీసీ జీ రజినీకాంత్ రెడ్డి శుక్రవారం తుది ఓటరు జాబితాను విడుదల చేశారు.
ఈ జాబితాలో 18 మంది సర్వీస్ ఓటర్లు.. ఎన్ఆర్ఐ ఓటర్లు 123 మంది.. పీపుల్ విత్ డిజేబుల్డ్ (పీడబ్ల్యూడీ) ఓటర్లు 1908 మంది ఉన్నారు. ఇటీవల ఓటరుగా నమోదు చేసుకున్న 18-19 ఏండ్ల యువతలో 3,781 మంది పురుషులు, 3,078 మంది మహిళలు.. 80 ప్లస్ ఉన్న వారిలో 3,281 మంది పురుషులు 2,772 మంది మహిళలు.. 85 ప్లస్ ఉన్న వారిలో 1,112 మంది పురుషులు 1,022 మంది మహిళలు ఉన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 139 పోలింగ్ స్టేషన్లలో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో కనీసం 986 మంది ఓటర్లున్నారు.