షేక్‌పేట్ అక్టోబర్ 26: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలను ప్రజలు గ్రహించాలని, కాంగ్రెస్ మోసపూరిత పాలనను తిప్పికొట్టడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్కు ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఆదివారం షేక్‌పేట్ కోహెసర్ కాలనీలో రిలయన్స్ జూబ్లీ అపార్టుమెంట్ వద్ద మహిళలతో కేటీఆర్ ముచ్చటించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న విద్యావంతులు ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి,మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్,ముఠా జయసింహ తదితరులు పాల్గొన్నారు.
