Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇటీవల ఓటరు కార్డులను పంపిణీ చేసి ప్రలోభ పెట్టగా.. తాజాగా మరో బాగోతం బయటపడింది. ఒకే ఇంట్లో 43 ఓట్లను నమోదు చేయించడం వెలుగులోకి వచ్చింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని యూసుఫ్‌గూడ ప్రాంతంలోని బూత్ నంబర్ 246లో ఒకే ఇంట్లో 43 ఓట్లను నవీన్ యాదవ్ నమోదు చేయించాడని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సుమారు 200 నుంచి 300 వరకు ఓటరు కార్డులను పంపిణీ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై ఎన్నికల కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి సమయంలో ఓటు చోరీలో భాగంగా నవీన్ యాదవ్ దొంగ ఓట్లను నమోదు చేయించినట్లు బయటపడటం కలకలం రేపింది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడం పట్ల తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటు చోరీపై ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఏమో ఆందోళనలు చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ నాయకులు ఓటు చోరీకి పాల్పడటంపై మండిపడుతున్నారు.
Jubilee Hills Voterlist1
Jubilee Hills Voterlist2
Jubilee Hills Voterlist3
Jubilee Hills Voterlist4