జవహర్‌నగర్, జూలై 26: నేను పోతా డాడీ… సర్కారు పాఠశాలకు అంటూ విద్యార్థులు ప్రభుత్వ బడులకు క్యూ కడుతున్నారు… మన ఊరు-మన బడి కార్యక్రమంతో సీఎం కేసీఆర్ సర్కారు బడుల రూపు రేఖలే మార్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు… సుందరంగా మారాయి… సర్కారు బడుల్లో డిజిటల్ చదువులతో విద్యార్థులు ఉన్నతంగా రాణిస్తున్నారు. ఆధునిక కాలానీకి అనుగుణంగా కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా సర్కారు బడుల్లో చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా పుస్తకాలు, దుస్తులు అందజేస్తున్నారు.
డిజిటల్ విద్యతో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ఉపాధ్యాయులు బోధిస్తున్నారు… ప్రభుత్వ బడిలో స్మార్ట్ చదువులకు విద్యార్థులు సంఖ్య భారీగానే పెరిగారు. సకల వసతులు కల్పిస్తుండడంతో జవహర్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆదర్శంగా నిలుస్తుంది.
సులభంగా అర్థమయ్యేలా డిజిటల్ విద్యను ప్రభుత్వ బడిలో బోధిస్తున్నారు. గతంలో ప్రైవేటు పాఠశాలకు ఫీజులు కట్టలేక చిన్నారులు బాలకార్మికులుగా మారేవారు. తెలంగాణ ప్రభుత్వం విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో… సర్కారు బడిలో అడ్మిషన్లు దొరకని పరిస్థితి నెలకొంది. డిజిటల్ ప్రొజెక్టర్‌పై ఉపాధ్యాయులు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేటట్టు చెప్తుండటంతో విద్యార్థులకు మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలకు తీసిపోకుండా…ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో విద్యార్థులు ముందంజలో ఉంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వం సర్కా రు బడుల్లో డిజిటల్ విద్యనందించడం ఆనందంగా ఉంది. ప్రైవేటు బడిలో చదువుకోవాలం టే ఫీజులు కట్టలేని దుస్థితి ఉం డేది. సీఎం కేసీఆర్ సార్… పేద పిల్లలు కూడా ఉన్నత చదువులు చదుకోవాలని ఇంగ్లిష్ మీడియం పెట్టడంతో నా లాంటి పేద పిల్లలకు ఎంతో మందికి ఉపయోగం.డిజిటల్ క్లాసులతో సులభంగా మాకు అర్థమతుంది.
– వై. వర్షిత, 10వ తరగతి, జవహర్‌నగర్ ఉన్నత పాఠశాల
సర్కారు బడిలో డిజిటల్ క్లాసులు వింటామనుకోలేదు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ బడులకు ధీటుగా ప్రభు త్వం మార్చడంతో నాలాంటి పేద పిల్లలందరికీ ఉన్నత చదువు అందుతుంది. డిజిటల్ క్లాసులు బోధిస్తుండటంతో సులభంగా అర్థమవుతుంది. ఉచితం గా పుస్తకాలు, దుస్తులు అందజేస్తుంది.తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– పి. జయ, 10వ తరగతి, జవహర్‌నగర్ ఉన్నత పాఠశాల