Jaggareddy | ఇటీవల సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే రాజకీయ వ్యంగ్య ధోరణితో యువతలో వేగంగా ప్రాచుర్యం పొందిన ఈ డిజిటల్ ఉద్యమానికి చెందిన ఖాతాను భారతదేశంలో నిలిపివేసినట్లు ఎక్స్ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఈ విషయాన్ని ఉద్యమ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తన వ్యక్తిగత ఖాతా ద్వారా వెల్లడించాడు. కాగా కాక్రోచ్ మూమెంట్‌పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఈ రోజు ఉద్యమం ఎక్కడినుంచి మొదలైంది టెక్నాలజీ నుంచే కదా.. కాక్రోచ్ ఉద్యమం బటన్ నొక్కంగనే ఇవాళ సోషల్ మీడియాలో వస్తుందంటే కారకులెవరు రాజీవ్‌గాంధీ. కాక్రోచ్ లాంటి ఉద్యమ నాయకులకు ఆలోచన కలిగించి దీన్ని వెలుగులోకి తెచ్చిందెవరు రాజీవ్‌గాంధీ. కాబట్టి కాక్రోచ్ కాన్సెప్ట్ చాలా బయటకు రావాలి. వచ్చిన తర్వాత దాని గురించి మనం మాట్లాడుదామన్నారు జగ్గారెడ్డి. ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం మొదలైందంటే దానికి రాజీవ్ గాంధీ తెచ్చిన టెక్నాలజీనే కారణమంటూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రౌండప్ చేస్తున్నాయి.
ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం మొదలైందంటే దానికి రాజీవ్ గాంధీ తెచ్చిన టెక్నాలజీనే కారణం
– కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి https://t.co/lS2LVSQbPK pic.twitter.com/MsspWBrqVO
— Telugu Scribe (@TeluguScribe) May 23, 2026