డంపింగ్ యార్డు ఎత్తివేయాలి
పదహారు లక్షల మంది ప్రజల ప్రాణాలతో రాంకీ చెలగాటమాడుతూ పర్యావరణ విధ్వంసం సృష్టించడం దుర్మార్గమని, వెంటనే చెత్తను తీసుకురావడం ఆపేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని డంపింగ్‌యార్డు ఎత్తివేత పోరాట జవహర్‌నగర్, దమ్మాయిగూడ జేఏసీలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.
- ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాంకీ: జేఏసీ
జవహర్‌నగర్, జూన్ 30: పదహారు లక్షల మంది ప్రజల ప్రాణాలతో రాంకీ చెలగాటమాడుతూ పర్యావరణ విధ్వంసం సృష్టించడం దుర్మార్గమని, వెంటనే చెత్తను తీసుకురావడం ఆపేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని డంపింగ్‌యార్డు ఎత్తివేత పోరాట జవహర్‌నగర్, దమ్మాయిగూడ జేఏసీలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి ఆధ్వర్యంలో మంగళవారం జవహర్‌నగర్ ప్రగతినగర్‌లోని నీలం రామచంద్రయ్యభవన్లో జవహర్‌నగర్, దమ్మాయిగూడ జేఏసీల సమావేశాన్ని నిర్వహించారు.
షేక్షావలి మాట్లాడుతూ డంపింగ్ యార్డులో నిల్వ ఉన్న చెత్తను బయోమైనింగ్‌ను ప్రారంభించాలని, మురుగునీటి ప్రవాహాన్ని అడ్డుకుని బాధిత ప్రజలకు ఉచితంగా తాగునీటి, వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. జీహెచ్ఎంసీ తక్షణమే ప్రత్యామ్నాయ సైట్లను ఏర్పాటు చేసి జవహర్‌నగర్‌కు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో శంకర్‌నారాయణ, మాజీ కార్పొరేటర్లు లలితాయాదవ్, వేణు, చిత్రసుబ్రహ్మణ్యం, సమ్మిరెడ్డి, మీరా, శివబాబు, నర్సింహగౌడ్, శంకర్, శివన్నారాయణ, ప్రవీణ్, చంద్రన్న, యాకస్వామి, పాషామియా, సునీత, అనంతలక్ష్మి, రాణి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

