సిటీబ్యూరో: నకిలీ జనన, మరణ ధ్రవీకరణలో ఆక్రమాలు వెలుగు చూశాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 74 హోమ్ బర్త్లపై గత కమిషనర్ విచారణకు ఆదేశించగా నాలుగు సర్టిఫికెట్లు నకిలీవిగా తేల్చారు. వాటిని రద్దు చేయడమే కాకుండా సంబంధిత శాఖ అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేసింది. హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగం తొలగింపు, సంబంధిత సర్కిళ్ల అధికారులు, బాధ్యులైన తల్లిదండ్రులు, సంతకాలు పెట్టిన వారు, నోటరీ చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు.
పోలీస్ శాఖ ద్వారా నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను టౌలిచౌకిలోని మెట్రో ఆసుపత్రి కారణమైనట్లు జీహెచ్ఎంసీకి దృష్టికి రావడంతో దాదాపు 65 జనన, 8 మరణ ధ్రువీకరణ పత్రాలు మెట్రో ఆసుపత్రి జారీ అయినట్లు తేల్చారు. వీటన్నింటినీ రద్దు చేసినట్లు చెప్పారు. సంబంధిత ఆసుపత్రి గుర్తింపు, వైద్యుని గుర్తింపు రద్దు చేయాలని సంబంధిత శాఖలకు లేఖ రాయనున్నట్లు అధికారులు తెలిపారు.