సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 ( నమస్తే తెలంగాణ ) : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్(నిధమ్)లో పర్యాటక కోర్సులు(Tourism Courses) అభ్యసించేందుకు దరఖాస్తులను (Applications) ఆహ్వానిస్తున్నట్టు అధికారులుమంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆమోది నిధమ్లో ఇంటర్, డిగ్రీలో బీఎస్సీ, బీబీఏ, ఎంబీఏ అడ్మిషన్ల ప్రక్రియ కోసం విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
టూరిజం, హాస్పిటాలిటీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీల్లో పనిచేసే అవకాశం లభిస్తుందని వివరించారు. క్యాంపస్ ఇంటర్వ్యూలతో పాటు దేశంలని హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో అనేక అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం 9553700034, 9553700035 నెంబర్ను సంప్రదించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Manipur | మణిపూర్లో మళ్లీ కర్ఫ్యూ.. ఇంటర్నెట్ సేవలు బంద్
Kejriwal Govt | కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి.. రాష్ట్రపతికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి
Rahul Gandhi | రాహుల్ ఎన్నటికీ దేశ ప్రధాని కాలేరు : లలన్ సింగ్