సిటీబ్యూరో, మార్చి15 (నమస్తే తెలంగాణ) : జిల్లా పరిధిలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల కోసం జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి మొత్తం 84,253 మందికి గాను 81,162 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 3,091 మంది విద్యార్హులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి, జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ కన్వీనర్ తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో మొదటి రోజు ఇంటర్, ఒకేషనల్‌కు సంబంధించి మొత్తం 74,681 మందికి గాను 72,373 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 2,308 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్టు జిల్లా విద్యాధికారి తెలిపారు. సరూర్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ఎల్బీనగర్లోని శివానీ జూనియర్ కాలేజీల్లో పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ హరీశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో…
మేడ్చల్, మార్చి15(నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం, ఒకేషనల్‌లో కలిపి 65,753 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా… 64,248 మంది హాజరయ్యారు. 1505 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి తెలిపారు.