హైదరాబాద్ : విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లాల్సిన విద్యాలయాలు మృత్యు నిలయాలుగా మారుతున్నాయి. శ్రీచైతన్య, నారాయణ కార్పొరేట్ ధనదాహం, మార్కుల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల ఒత్తిడిని తట్టుకోలేక ఎంతో మంది వద్యార్థులు తమ ప్రాణాలను బలితీసుకుంటున్నారు. తాజగా శ్రీ చైతన్య కాలేజీలో(Sri Chaitanya College) విషాదం చోటు చేసుకుంది. హాస్టల్ గదిలో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన మియాపూర్ శ్రీ చైతన్య బాయ్స్ జూనియర్ కాలేజీలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కౌశిక్ రాఘవ(17) అనే విద్యార్థి ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం అర్ధ రాత్రి ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. విద్యార్థి మృతిని కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచారు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ కాలేజీ ముందు ఆందోళన చేపట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Jharkhand | బీజేపీ ఆశలు గల్లంతు.. జార్ఖండ్ పీఠం హేమంత్‌దే
Ajit Pawar | అబ్బాయ్ ఆశలు ఆవిరి..! బాబాయ్‌కి మళ్లీ పెద్ద పోస్టే వరించేనా..?