Beer | ఈ వేసవిలో బీరు ప్రియులు వైన్స్‌ల వద్ద క్యూలు కట్టడం సాధారణంగా కనిపించేదే. అయితే ఓ చల్లని బీరు తాగి సేద తీరుదామనుకున్న వినియోగదారుడికి ఊహించని షాక్ తగిలింది. సదరు వ్యక్తి కొనుగోలు చేసిన బీరు బాటిల్లో చనిపోయిన పురుగు అవశేషాలు, ఫంగస్ ఉన్నట్టు తెలుసుకుని కంగుతిన్నాడు.
వర్ధన్నపేట పట్టణంలోని శ్రీ మల్లికార్జున స్వామి వైన్ షాపులో సోమవారం ఓ వినియోగదారుడు కొనుగోలు చేసిన బీరు బాటిల్లో చనిపోయిన పురుగు అవశేషాలు, ఫంగస్ ఉన్నట్లు గుర్తించాడు. ఈ ఘటనపై సామాజిక మద్యంలో వైరల్ కావడంతో ఎక్సైజ్ సీఐ స్వరూప వైన్ షాపును సందర్శించారు. అక్కడ బీరు నిల్వలను తనిఖీ చేసి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. నాణ్యత ప్రమాణాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.
Shamim Mafi | ఇరాన్‌కు బాంబు, డ్రోన్ సప్లయ్.. లాస్ ఏంజెలెస్‌లో మహిళా వ్యాపారవేత్త అరెస్ట్
Basaveshwara Jayanti | సిరిసిల్ల కలెక్టరేట్లో ఘనంగా బసవేశ్వర మహారాజ్ జయంతి
Chandra Babu | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ, ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు