సిరిసిల్ల : కులవ్యవస్థను, వర్ణభేదాలను, లింగ వివక్షను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాది బసవేశ్వర మహారాజ్ జయంతిని ( Basaveshwara Jayanti) సోమవారం రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ బసవేశ్వర మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి ఎం. సౌజన్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, రాష్ట్ర మహిళా కార్యదర్శి కాకరకాయల మంజుల, గౌరవ అధ్యక్షులు ఆకుల రాములు, అద్యక్షులు చిట్టి శోం కుమార్, ఉపాధ్యక్షులు కడెం శివప్రసాద్, జనరల్ సెక్రటరీ పత్తి స్వామి, ప్రధాన కార్యదర్శి సొల్లేటి చంద్రమౌళి, వీరశివ బందువులు , బీసీ అభివృద్ధి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.