మల్లాపూర్, జనవరి 8: పద్మశాలీయుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ఆదివారం మల్లాపూర్ అంబేడ్కర్ భవన్లో ఏర్పాటు చేసిన నూతన సంవత్సరం 2023 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే బేతి, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్‌రెడ్డి, జే.ప్రభుదాస్ ముఖ్యఅతిథులుగా విచ్చేసి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేతన్నల పేదరికాన్ని దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి పథకాలు రూపొందించిందని, స్థానికంగా పద్మశాలీయులకు సంబంధించి ఏ సమస్యలున్నా తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు బాబురావు, మేడ్చల్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు శంకర్, సాయిజెన్ శేఖర్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు అనంతరామ్, కార్యదర్శి స్వామినాథన్, చిక్క నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి
అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. మీర్‌పేట హెచ్‌బీకాలనీ డివిజన్‌కు చెందిన శ్రీ సోమవంశ సహస్ర అర్జున క్షత్రియ సామాజ్ రూపొదించిన నూతన క్యాలెండర్‌ను ఆదివారం స్థానిక కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్‌తో కలిసి ఆయన అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన పేదలు ప్రభుత్వం ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సోమవంశ సహస్ర అర్జున క్షత్రియ సామాజ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రతన్ సూర్యప్రకాశ్, ఉపాధ్యాక్షుడు ప్రేమ్‌నాథ్, ప్రధాన కార్యదర్శి మన్మోహన్, శ్యామ్ మనవర్, జ్యోతి, విశాల్, శివాని, విక్రం, బీఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, గరిక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
యోగాతో సర్వరోగాలు నయం
రామంతాపూర్, జనవరి 8: యోగా ద్వారా సర్వరోగాలను నయం చేసుకోవచ్చునని, ప్రతి ఒక్కరు యోగా నేర్చుకోవాలని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ఆదివారం యోగా మాస్టార్ రవీందర్ ఆధ్యర్యంలో రామంతాపూర్ నెహ్రూనగర్ కమ్యునిటీ హాల్లో ‘యోగా దినోత్సవ’ వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే బేతి మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా యోగా మాస్టర్ రవీందర్ యోగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో మరింతమందికి యోగా శిక్షణ ఇవ్వాలన్నారు. అనంతరం యోగా మాస్టర్ రవీందర్ మాట్లాడుతూ.. నేటి ఆధునికి జీవన ప్రపంచంలో అందరూ యోగాను అలవాటు చేసుకోవాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో స్థానిక సంక్షేమ సంఘం అధ్యక్షు డు ధూపాటి సురేశ్, తూటి నర్సింహ, ఇటుకల వెంకటేశ్, సురేశ్, రమేశ్‌గౌడ్, ఆనంద్, రాజారాం, శోభ, రాధిక, సరిత, చంద్రకళ, సురేఖ, గాయత్రి పాల్గొన్నారు.