మేడ్చల్, సెప్టెంబర్14(నమస్తే తెలంగాణ): చెరువుల సమీపంలో బఫర్ల జోన్ల వద్ద హద్దుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా 489 చెరువులు ఉన్నాయి. చెరువుల సమీపంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా త్వరలోనే సర్వేలు నిర్వహించేలా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు.
చెరువుల సమీపంలో బఫర్ జోన్లకు హద్దులు ఉన్నప్పటికీ తిరిగి రీ సర్వే చేసి నూతనంగా హద్దులు ఏర్పాటు చేసేలా చూస్తున్నారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని చెరువుల సమీపంలోని బఫర్ జోన్లలో ఆక్రమణలకు గురై ఇండ్లను నిర్మిస్తున్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సర్వేలు చేసి బఫర్ జోన్ల హద్దులను గుర్తించినట్లయితే అక్రమ నిర్మాణాలు సంఖ్య తేలిపోతుందని అధికారులు చెబుతున్నారు.