Talasani Saikiran Yadav | సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు కోసం శనివారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి శాంతి ర్యాలీకి మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఉదయం నుండే పెద్ద సంఖ్యలో మోహరించి అక్రమ అరెస్టులు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ యువనేత తలసాని సాయి కిరణ్ యాదవ్ నల్ల దుస్తులు ధరించి నల్ల బెలూన్లతో సికింద్రాబాద్ బచావ్ నినాదాలతో నిరసన తెలుపుతూ ఎంజీ రోడ్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ పోలీసు స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామన్నా అక్రమంగా అరెస్టులు చేసి 144 సెక్షన్, కర్ఫ్యూ అమలులో ఉందా అన్నట్లు వేలాదిమంది పోలీసులు వచ్చి ర్యాలీని అడ్డుకోవడాన్నితీవ్రంగా ఖండించారు. జంట నగరాలు అంటేనే హైదరాబాద్, సికింద్రాబాద్లు అని గుర్తింపు ఉందని, అలాంటి సికింద్రాబాద్ చరిత్ర, అస్తిత్వం లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. తమ అస్తిత్వం కోసం పోరాడుతుంటే అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాయం అన్నారు. ఈ నెల 5వ తేదీన ర్యాలీకి అనుమతి కోరితే ఉద్దేశ పూర్వకంగా శుక్రవారం రాత్రి అనుమతిని రిజెక్ట్ చేశారని చెప్పారు.
ర్యాలీకి అనుమతి లేకుంటే ర్యాలీకి ముందురోజు పోలీసు అధికారులు తాము చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు కదా అని ప్రశ్నించారు. అరెస్టులతో తమ ఉద్యమం ఆగదని చెప్పారు. ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారని, రెట్టింపు ఉత్సాహంతో ఫిబ్రవరి మొదటి వారంలో పెద్ద ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.

CEIR | కాల్వశ్రీరాంపూర్లో పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత
Republic Day Alert | రిపబ్లిక్ డే వేడుకలకు ఉగ్రముప్పు.. కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు
Donald Trump: ఇండో, పాక్ ఉద్రికత్తలను తగ్గించా.. మళ్లీ రిపీట్ చేసిన డోనాల్డ్ ట్రంప్