Republic Day Alert : ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల (Republic Day celebrations) ను లక్ష్యంగా చేసుకుని ఢిల్లీలో ఉగ్రవాదులు (Terrorists) దాడులు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘావర్గాలు తెలిపాయి. ఖలిస్థానీ, బంగ్లాదేశ్ కేంద్రంగా ఉన్న ఉగ్ర సంస్థలు ఈ గణతంత్ర వేడుకుల సందర్భంగా ఢిల్లీ సహా దేశంలోని ప్రముఖ నగరాల్లో దాడులకు ప్రయత్నించవచ్చునని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.
దేశ అంతర్గత భద్రతను దెబ్బతీసేందుకు ఖలిస్థానీ, ఇతర రాడికల్ హ్యాండ్లర్లు స్థానిక గ్యాంగ్స్టర్లను ఉపయోగించుకుంటున్నారని నిఘావర్గాలు తెలిపాయి. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్లలో ఉగ్రనెట్వర్క్ను విస్తరిస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపాయి. గత ఏడాది ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు జరిగిన నేపథ్యంలో.. నిఘా వర్గాల హెచ్చరికలపై అధికారులు అలర్ట్ అయ్యారు.
దేశ రాజధాని ఢిల్లీ సహా ఇతర ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్రాల
ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేశారు. దాంతో రాష్ట్రాల్లో తనిఖీలు మొదలుపెట్టారు.