GHMC | హైదరాబాద్ : జీహెచ్ఎంసీ నూతన కమిషనర్‌గా ఐఏఎస్ ఇలంబరితి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఇలంబరితికి జీహెచ్ఎంసీ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబరితికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నిన్నటి వరకు బాధ్యతలు నిర్వర్తించిన ఆమ్రపాలి.. ఆంధ్రప్రదేశ్‌కు రిలీవ్ కావడంతో ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌గా పని చేస్తున్న ఇలంబరితికి జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. డీవోపీటీ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పని చేసిన ఆమ్రపాలి ఏపీలో రిపోర్టు చేశారు.
జీహెచ్ఎంసీ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ ఇలంబరితి. https://t.co/aY15PsB7ZU pic.twitter.com/sJsh3QhYIu
— Telugu Scribe (@TeluguScribe) October 17, 2024
ఇవి కూడా చదవండి..
Group-1 Mains | గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
Group-1 | గ్రూప్-1 అభ్యర్థులతో కేటీఆర్ సమావేశం..
KTR | ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసురుల ఇష్టారాజ్యం..! కేటీఆర్ ఫైర్