Bhatti vikramarka | న్యూఢిల్లీ : ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో బడ్జెట్ సన్నాహక సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. అంతకుముందుకు ఈ సమావేశంపై డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ..
రాష్ట్ర అవసరాలు, రాష్ట అంశాలపై సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి దృష్టికి తీసుకెళ్తానని… వాటి పై ప్రతిపాదనలు ఇస్తామని అన్నారు. రాష్ట ప్రయోజనాలకు సంబంధించి (విద్య) యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు, వైద్యం ,మౌలిక సదుపాయాలపై సమావేశంలో మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు.
తెలంగాణలో నిర్మించే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, రీజనల్ రింగ్ రోడ్, మూసి ప్రక్షాళన, మెట్రో రైలు , జాతీయ ఉపాధి హామీ పథకం , యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటుకు ఆర్థిక సహకారాన్ని కోరుతామన్నారు.