Justice For Kailash | పాకిస్తాన్ లో హిందూ యువకుడు కోహ్లీ హత్య.. సింధ్ ప్రావిన్స్ లో ఉద్రిక్తత
Justice For Kailash : ఒక పక్క బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులతో ఆందోళన వ్యక్తమవుతుంటే.. ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా హిందువును కాల్చి చంపారు. గతవారం పాకిస్తాన్ లో కైలాష్ కోహ్లి (25) అనే యువకుడిని దుండగులు అతి సమీపంనుంచి కాల్చి చంపారు.
Justice For Kailash : ఒక పక్క బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులతో ఆందోళన వ్యక్తమవుతుంటే.. ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా హిందువును కాల్చి చంపారు. గతవారం పాకిస్తాన్ లో కైలాష్ కోహ్లి (25) అనే యువకుడిని దుండగులు అతి సమీపంనుంచి కాల్చి చంపారు. ఈ ఘటన పాకిస్తాన్లోని, సింధ్ ప్రావిన్స్, బదిన్ జిల్లా తల్హార్ తహసిల్ పరిధిలో జనవరి 4న జరిగింది. పోలీసులు, మీడియా కథనం ప్రకారం.. హిందువైన కైలాష్ స్థానికంగా వ్యవసాయం చేస్తూ ఉండేవాడు.
అతడు సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా ఉండేవాడు. అక్కడి హిందువులపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ.. గళమెత్తేవాడు. దీంతో అతడికి స్థానిక నాయకుడిగా గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే అతడిని ఈ నెల 4న గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. బుల్లెట్లు అతడి ఛాతీలో దిగడంతో కైలాష్ అక్కడికక్కడే మరణించాడు. అతడి హత్య జరిగినప్పటి నుంచి అక్కడి హిందువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇటీవల మరింత ఉదృతంగా ఆందోళన చేస్తున్నారు. బదిన్ ప్రాంతంలోని రోడ్లను ఆందోళనకారుల బ్లాక్ చేశారు. కైలాష్ మృతికి న్యాయం చేయాలని, హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వరుసగా రెండు రోజులనుంచి నిరసనలు కొనసాగుతున్నాయి.
Badin Sindh
The protest for the arrest of the killers of the martyred Kalash Kolhi is making history.
Shiva Kachhi, Chairman of Pakistan Darawar Ittehad @PItehad is leading the historic protest sit-in.
This was not just a protest—it was the cry of a wounded conscience.
From… pic.twitter.com/uo9io9PAk0— Shiva Kachhi (دراوڙ)🇵🇰 (@FaqirShiva) January 9, 2026
జస్టిస్ ఫర్ కైలాష్ అంటూ నినదిస్తున్నారు.కొంతకాలంగా హిందువులు తీవ్ర భయంతో, అభద్రతా భావంతో బతుకుతున్నట్లు తెలిపారు. బలవంతపు మత మార్పిడులు, వేధింపులు, అత్యాచారాలు వంటివి ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తమకు న్యాయం కావాలని, భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఈ మేరకు పాక్ లోని మైనారిటీ హక్కుల సంస్థ చైర్మన్ శివ కచ్చి స్పందించారు. హిందువులపై దాడుల్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

