KTR | హైదరాబాద్లోని మల్లాపూర్లో జరిగిన 18వ హమాలీ యూనియన్ మహాసభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర అధినేత, రాష్ట్రాన్ని నడిపే వ్యక్తి మంచి బుద్ది కలిగిన రాష్ట్రంలో పేదలు కానీ, పెద్దలు కానీ సంతోషంగా ఉంటారు. రాష్ట్రంలో హమాలీలు కానీ లేదా మిల్లు యజమానులు కానీ సంతోషంగా ఉంటారు. పదేళ్లు మనం కేసీఆర్ ప్రభుత్వంలో అదే చూసినం. రైతులు బాగున్నరు. పారిశ్రామిక వేత్తలు బాగున్నారు. కరెంట్ బాగుండే, పారిశ్రామిక వేత్తలు బాగుండే, కార్మికులు బాగుండేనన్నారు. అంతా సుభిక్షంగా ఉండే. కానీ కొంత ఏమరపాటు వల్ల మనం చేసిన కొన్ని పొరపాట్ల వల్ల మనం అధికారం కోల్పోయినమన్నారు.
శీనన్న చెప్పినట్టు అధికారం పోతే పోయింది.. కానీ ప్రజల్లో మమకారం తగ్గలేదు. అధికారం పోతే పోయింది.. కానీ కొన్ని వాస్తవాలు ఇయ్యాళ్ల మనకు కూడా తెలుస్తున్నయి. కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ది తెలిసిందని… ఎవడు మనోడు ఎవడు పగోడు మనకు కూడా అర్థమవుతోంది. ఎవరైతే ఈ కష్టసమయంలో కూడా మనతో నిలబడి ఉన్నరో 18వ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నం మేము.. మా గుండెల్లో కేసీఆర్ను పెట్టుకున్నం. మీరు రావాలే అని మమ్మల్ని పిలుచుకున్న మా హమాలీ సోదరులకు మీ రుణం తప్పకుండా తీర్చుకుంటానని కేటీఆర్ హమాలీలకు హామీనిచ్చారు.
మీ ప్రతీ సమస్య పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని విజ్ఞప్తి చేస్తున్నా. శీనన్నకు కూడా చెప్తున్నా.. మీరు గట్టిగా ఉండండి.. మిమ్మల్ని చేయగలిగింది ఏమీ లేదు. మా మీద అంటే రెండు కేసులు పెడ్తరు. మీ మీద కూడా కేసులు పెడితే ఏమైతదో ఆయనకు కూడా తెలుసు. మిమ్మల్ని ఎవ్వడూ ఏమి చేయలేడు. ఐకమైత్యంగా, గట్టిగా ఉండండి.. ఇంకో రెండేళ్లలో తిరిగి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసుకుందా. చిన్న చిన్న సమస్యలేమున్నా తప్పకుండా పరిష్కారం చేసుకుందామన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు క్యామ మల్లేష్, హమాలీ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్ర పాలకుడు మంచివాడైతేనే ప్రజలంతా సంతోషంగా ఉంటారు…
అధికారం పోయినా కేసీఆర్ గారిపై ప్రజల ప్రేమ తగ్గలేదు.ఈ కష్టకాలంలోనూ మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్న హమాలీ సోదరుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.. మీ ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత నాది.
కార్మిక లోకం ఐకమత్యంగా, గట్టిగా… pic.twitter.com/4wx80b9uG4
— BRS Party (@BRSparty) July 6, 2026