Bandi Sanjay | పోక్సో (POCSO)కేసులో నిందితుడిగా ఉన్న కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ 9 రోజుల హైడ్రామా అనంతరం పోలీసుల ఎదుట ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. అయితే ఓ వైపు సాయి భగీరథ్‌ను మేమే అరెస్ట్ చేశామని పోలీసులు అంటుంటే.. మరోవైపు తానే పోలీసులకు అప్పగించానని బండి సంజయ్ చెప్పుకొస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉంటే ఈ కేసులో తనను తాను సమర్థించుకున్నట్టుగా బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తారనే వార్త ప్రచారంలో ఉన్నది.. దానికేమంటరని ఓ రిపోర్టర్ బండి సంజయ్‌ను అడిగారు. దీనికి బండి సంజయ్ స్పందిస్తూ.. ఇది కోర్టు పరిధిలో ఉంది.. కోర్టులో కేసు నడుస్తున్నది. ఒక్కడి గుర్తు పెట్టుకోండి.. కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భంగా ఏమైనా ఉందా..? కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పజెప్పిన.. అంటూ కామెంట్ చేశారు.
కాగా పోక్సో (POCSO) కేసులో బెయిల్ వస్తుందని 9 రోజుల దాకా కొడుకును దాచి, బెయిల్ రాకపోవడంతో బీఆర్ఎస్ ఆందోళన, ప్రజా సంఘాలు, విద్యార్థుల నుంచి వస్తున్న వ్యతిరేకత తట్టుకోలేక దిక్కు లేని స్థితిలో బండి సంజయ్ తన కొడుకును అప్పగించాడని అంతా చర్చించుకుంటున్నారు. POCSO కేసులో కొడుకుని 9 రోజులు దాచిన ఏకైక కేంద్ర మంత్రి కూడా తమరే అని ప్రజలు బాహాటంగానే మాట్లాడుతున్నారు.
మారని బండి సంజయ్ తీరు
“సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకుని సరెండర్ చేశాను” అంటూ అదే అబద్ధాలు
“కన్న కొడుకును పోలీసులకు అప్పగించిన తండ్రిని చరిత్రలో ఎక్కడైనా చూసారా?” అంటూ అదే అమాయకపు చక్రవర్తి నటన మాటలు
POCSO కేసులో బెయిల్ వస్తుందని 9 రోజుల దాకా కొడుకును దాచి, బెయిల్ రాకపోవడంతో… https://t.co/GmeSlKaqRU pic.twitter.com/efXlQ1U8R1
— Telugu Scribe (@TeluguScribe) May 20, 2026
Chattogram | బంగ్లాదేశ్‌లో భారతీయ దౌత్యవేత్త అనుమానాస్పద మృతి.. గుండె పోటే కారణమా..?
US Tragedy | అమెరికాలో బాపట్ల టెక్కీ మృతి.. తల్లిదండ్రులు, తమ్ముడికి తీవ్ర గాయాలు