సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ)/మన్సూరాబాద్ : ఉప్పల్ నల్లచెరువులో కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. చెరువు పర్యవేక్షణకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించామని తెలిపారు.
ఉప్పల్ స్థానిక నాయకులతో కలిసి మంగళవారం నల్లచెరువును పరిశీలించారు. చెరువులు, నాలాలను, ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కబ్జాలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు.
చెరువును పరిశీలించిన వారిలో తహసీల్దార్ వాణిరెడ్డి, డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు, ఈఈ నాగేందర్, ఇరిగేషన్ ఏఈ పృథ్వీ ఉన్నారు. అలాగే మన్సూరాబాద్ డివిజన్ హయత్నగర్ పరిధిలోని హత్తిగూడ చెరువు ఎఫ్టీఎల్ను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు.