దుండిగల్, ఏప్రిల్ 3: కుత్బుల్లాపూర్ మండలంలోని గాజులరామారంలో అల్టా్ర కమిషనర్ రంగనాథ్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా సర్వే నెంబర్ 307, ప్రభుత్వ భూముల కబ్జాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో వెలసిన ఆక్రమణల విషయమై స్థానిక రెవిన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా సర్వేనెంబర్ 307 లోని క్వారీ, పరిసర ప్రాంతాల్లోని భూములకు సంబంధించిన పత్రాలను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.
వారం రోజుల్లోగా మరోసారి సర్వేనెంబర్ 307 ప్రభుత్వ భూముల ఆక్రమణ పై రివ్యూ మీటింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా బాలానగర్ మండలంలోని సర్వే నెంబర్ 57, కుత్బుల్లాపూర్ మండలంలోని సర్వే నెంబర్ 307 మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతాలను సైతం ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో హైడ్రా ఇన్స్పెక్టర్ నరేష్, కుత్బుల్లాపూర్ మండల గిర్దావర్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.