Road Accident | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నగరానికి చెందిన ఓ విద్యార్థిని (Hyderabad woman) ప్రాణాలు కోల్పోయింది. విద్యార్థినిని గండిమైసమ్మ (Gandi Maisamma) ప్రాంతంలోని బాలాజీ నగర్‌కు చెందిన శ్రీను వర్మ కుమార్తె శ్రీజ వర్మ (23)గా గుర్తించారు.
శ్రీజ ఉన్నత చదువుల కోసం కొంతకాలం క్రితమే అమెరికాకు వెళ్లింది. అక్కడ చికాగో (Chicago)లో నివసిస్తోంది. సోమవారం రాత్రి తాను ఉంటున్న అపార్ట్మెంట్ నుంచి దగ్గర్లోని రెస్టారెంట్‌కు డిన్నర్ చేసేందుకు నడుచుకుంటూ వెళ్లింది. ఈ క్రమంలో ఓ ట్రక్కు శ్రీజను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీజ.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
కాగా, సిద్దిపేట జిల్లాకు చెందిన శ్రీను వర్మ ఫ్యామిలి కొంతకాలం కిందటే హైదరాబాద్‌కు షిఫ్ట్ అయినట్లు తెలిసింది. శ్రీను వర్మ డ్రైవర్‌గా పనిచేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నారు. పై చదువులకని వెళ్లిన తన కుమార్తె ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కాగా, శ్రీను వర్మ చిన్న కుమార్తె శ్రేయా వర్మ సైతం ఎంఎస్ చేసేందుకు 20 రోజుల క్రితం అమెరికా వెళ్లినట్లు బంధువులు తెలిపారు.
Also Read..
Food Sopts in Begum Bazar | బేగంబజార్‌లో ఫుడ్ స్పాట్స్ ఇవే.. టేస్ట్ అదిరిపోద్ది..!
khazana jewellery | చందానగర్ ఖజానా జ్యువెలరీలో దోపిడీ దొంగల బీభత్సం.. సీసీటీవీ ఫుటేజీ విడుదల