Food Sopts in Begum Bazar | బేగంబజార్( Begum Bazar ).. ఇదంతా హోల్‌సేల్ మార్కెట్. నిత్యం వ్యాపారులతో కళకళలాడుతూ ఉంటుంది. ఒక్క హైదరాబాద్( Hyderabad ) నగరం నలుమూలల నుంచే కాదు.. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వ్యాపారస్తులు బేగంబజార్‌కు వస్తుంటారు. అంతేకాదండోయ్ పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా బేగంబజార్‌కు వచ్చి రకరకాల వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. చిన్న పిల్లల ఆట వస్తువుల నుంచి మొదలుకుంటే.. ఇంటి గృహోపకరణాలు, కిచెన్ సామాన్లు, విద్యార్థులకు కావాల్సిన సామాగ్రి, మహిళలకు కావాల్సిన జ్యువెలరీతో పాటు అన్ని రకాల వస్తువులు బేగంబజార్‌లో లభ్యమవుతుంటాయి. కాబట్టి బేగం బజార్ ప్రతి రోజు వ్యాపారులు, సామాన్య ప్రజలతో సందడిగా ఉంటుంది. అయితే ఇంత సందడిగా ఉంటూ.. వ్యాపారం జోరుగా సాగే బేగంబజార్‌లో ఫుడ్ స్పాట్స్ కూడా ఉన్నాయి. ఈ ఫుడ్ స్పాట్స్‌లో దొరికే ప్రతి ఆహారం పదార్థం ఎంతో రుచిగా ఉంటుంది. చాలా మందికి బేగంబజార్ దోశ సుపరిచితమే. రుచి కూడా అద్భుతమే. ఈ దోశతో పాటు పలు రకాల ఆహార పదార్థాలను కూడా టేస్ట్ చేయొచ్చు. మరి ఆ ప్రత్యేక రుచి కలిగిన ఆహార పదార్థాలు లభ్యమయ్యే ఫుడ్ స్పాట్స్( Food Spots ) గురించి తెలుసుకుందాం.
సిమ్రాత్ దాబా ప్యూర్ వెజిటేరియన్ దాబా. ఇది రెండు దశాబ్దాల నుంచి ఆహార ప్రియులకు సుపరిచితంగా ఉంది. దీంట్లో పూర్తిగా పంజాబీ ఫుడ్ దొరుకుతుంది. బేగం బజార్‌కు సిమ్రాత్ దాబా ఓ గుండెకాయ లాంటిదని కూడా చెప్పొచ్చు. దాల్ తడ్కా, పన్నీర్ కీమా, హండీ బిర్యానీ, కాజు మసాలా ఫేమస్. ఇవి ఒక్కసారి ఆరగించారంటే మళ్లీ మళ్లీ తినాలపిస్తుంది. ఇక బేబి నాన్, చట్పటా నాన్ లాంటి బ్రెడ్స్‌ను కూడా ట్రై చేయొచ్చు.. టేస్ట్ అదిరిపొద్ది.
శ్యామ్ సింగ్ చాట్ బండార్ 1972లో ప్రారంభమైంది. ఇది బేగంబజార్‌లోనే అత్యంత ప్రాచీనమైన చాట్ బండార్ అని చెప్పొచ్చు. ఇది దహీ వడ, పుచ్‌కాస్, పావ్ భాజీ, రగ్డా చాట్‌కు ఫేమస్.
శ్రీ జోధ్‌పూర్ మిఠాయి ఘర్.. స్మాల్ అనియన్ కచోరీకి ఫేమస్. రాజ్ కచోరీ, బ్రెడ్ పకోడా వంటి ఆహార పదార్థాలు లభిస్తాయి. ఇక రాజ్ కచోరీని తినేందుకు జనాలు ఎగబడుతుంటారు. ఎప్పుడు చూసినా ఈ మిఠాయి ఘర్ రద్దీగా ఉంటుంది.
సత్యనారాయణ మిఠాయి బండార్ కూడా ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ స్టాల్. వైట్ కలకాన్, అజ్మేరీ కలకాన్, దూద్ పేడ, లచ్చేదార్ రబ్రీకి ఈ మిఠాయి బండార్ అత్యంత ప్రసిద్ధి. మీరు స్వీట్ లవర్స్ అయి ఉంటే.. ఈ బండార్‌లో కాజు కత్లీ, రసమలై, గులాబ్ జామ్‌ను ట్రై చేయొచ్చు.
ఇది 80 ఏండ్ల క్రితం ఏర్పాటు చేశారు. పాలు, పాల ఉత్పత్తులకు ఇది ఫేమస్. సాఫ్ట్ బన్ మలై తింటే రుచి అదిరిపొద్ది. రబ్దీ మలై బన్, కీసర్ మలై బన్, వార్మింగ్ కేసర్ దూద్, కడాయి కా లాల్ దూద్ సూపర్బ్. ఇవి తాగామంటే ఏం రుచిరా అనిపించక తప్పదు.
బాబాజీ ఇడ్లీ సెంటర్‌ను గత ఆరు దశాబ్దాల నుంచి నిర్వహిస్తు్ననారు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌కు ఇది ఎంతో ఫేమస్. ఇక్కడ ఇడ్లీలు ఎంతో రుచిగా ఉంటాయి. దీనికి ఇచ్చే చట్నీ కూడా సూపర్బ్. రూ. 25 కు నాలుగు ఇడ్లీలను సర్వ్ చేస్తారు. మార్నింగ్ 8.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఈ ఇడ్లీ అందుబాటులో ఉంటుంది.