ముక్తిరాజ్ సొమ్మెక్కడ పెట్టాడు.. రికవరీపై సీసీఎస్ పోలీస్ ఫోకస్
ట్రేడింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన మల్టీజెట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు ముక్తిరాజ్ బాధితుల నుంచి సేకరించిన సొమ్ము ఎక్కడ పెట్టుబడిగా పెట్టాడనే అంశంపై పోలీసులు ఫోకస్ పెట్టారు
సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ట్రేడింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన మల్టీజెట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు ముక్తిరాజ్ బాధితుల నుంచి సేకరించిన సొమ్ము ఎక్కడ పెట్టుబడిగా పెట్టాడనే అంశంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. హబ్సిగూడలో ఈ ఏడాది జూలైలో రియల్ లైఫ్ ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుతో సంస్థను ప్రారంభించాడు.
నెల రోజుల్లోనే పేరును మల్టీజెట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చేసిన అతడు.. తన సంస్థలో మహారాష్ట్రకు చెందిన మోతీలాల్ సర్కార్, ప్రశాంత్ ఎక్నాథ్ బురండిలను డైరెక్టర్లుగా నియమించుకున్నాడు. ట్రేడింగ్ పేరుతో గొలుసుకట్టు విధానంలో వేలాది మందిని సభ్యులుగా చేర్చుకున్న ముక్తిరాజ్, మూడున్నర నెలల్లోనే సుమారు రూ. 150 కోట్ల వరకు వసూలు చేసి బిచాణా ఎత్తేశాడు. బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని శనివారం అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న బాధితులు పెద్ద సంఖ్యలో సీసీఎస్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. బాధితులకు న్యాయం చేసేందుకు తమవంతు ప్రయత్నం చేస్తామంటూ పోలీసులు నచ్చజెప్పారు. ఈ క్రమంలోనే నిందితుడిని కస్టడీలోకి తీసుకొని రికవరీపై ఫోకస్ పెట్టనున్నారు.
డబ్బంతా ఎక్కడ..?
ముక్తిరాజ్ ట్రేడింగ్ పేరుతో బాధితుల నుంచి సేకరించిన సొమ్మంతా ఏం చేశాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడి పాత నేరచరిత్రను కూడా పోలీసులు తవ్వుతున్నారు. ముక్తిరాజ్ బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు. ఇక్కడ సంపాదించిన సొమ్ముతో ఎక్కడ ఆస్తులు కొన్నాడు, ఎవరైనా బినామీలు ఉన్నారా.? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు వారం రోజులుగా బాధితుల నుంచి స్టేట్మెంట్ల రూపంలో వివరాలు సేకరిస్తున్నారు. వారిచ్చిన సమాచారంతో బాధితుల జాబితాను కూడా తయారు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, ఇప్పుడు రికవరీపై దృష్టిసారించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

