Hyderabad | హైదరాబాద్లో షార్ట్ టర్మ్ వీసాలతో ఉంటున్న నలుగురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని వారిని హెచ్చరించారు. కేంద్ర హోం శాఖ ఆదేశాలతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఈ మేరకు నోటీసులు ఇచ్చారు.
పహల్గామ్లో టెర్రిరిస్టుల దాడి నేపథ్యంలో వివిధ వీసాలతో భారత్లో ఉంటున్న పాకిస్థానీయులను పంపించేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఆదేశాలతో పలు రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్లో మొత్తం 213 మంది పాకిస్థాన్ దేశస్తులు ఉన్నారని గుర్తించారు. వారిలో నలుగురు షార్ట్ టర్మ్ వీసాలతో ఉన్న వారికి ఇవాళ హైదరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.