Nehru Zoological Park | చాంద్రాయణ గుట్ట, మార్చి 30 : హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్. రేపు అనగా సోమవారం నాడు నెహ్రూ జూలాజికల్ పార్క్ తెరిచే ఉండనుంది. ఈ విషయాన్ని జూ క్యూరేటర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సోమవారం రంజాన్ సెలవు దినం కావడంతో జూ పార్క్‌కు కూడా సెలవు ఉంటుందని సందర్శకులు భావించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే జూ క్యూరేటర్ క్లారిటీ ఇచ్చారు. రంజాన్ పర్వదినాన కూడా జూపార్క్ తెరిచే ఉంటుందని వెల్లడించారు. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జూ తెరిచే ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.