Hyderabad Metro | హైదరాబాద్ : ఈ నెల 6వ తేదీన గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులను, ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైళ్లను నాన్‌స్టాప్‌గా నడపాలని మెట్రో అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 6వ తేదీన ఉదయం 6 గంటల నుంచి మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. సెప్టెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు నాన్‌స్టాప్‌గా సేవలందించనున్నాయి.
మెట్రో రైళ్ల సేవలను భక్తులు, ప్రయాణికులు వినియోగించుకోవాలని మెట్రో అధికారులు సూచించారు. ప్రతి ఏడాది వినాయక నిమజ్జనం రోజున మెట్రో రైళ్లు తమ సేవలను పొడిగిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా క్రికెట్ మ్యాచ్‌ల వేళ, ఇతర రద్దీ సమయాల్లో ప్రయాణికులకు అనుగుణంగా హైదరాబాద్ మెట్రో సేవలందిస్తుంది.