హైదరాబాద్ : మెట్రో ప్రయాణికులకు ఎల్ అండ్ టీ సంస్థ శుభవార్త వినిపించింది. సమ్మర్ హాలిడేస్‌ను ఎంజాయ్ చేసేందుకు వీలుగా ప్రయాణికులకు సూపర్ సేవర్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చింది.
హైదరాబాద్ మెట్రో రైల్లో సూపర్ సేవర్ కార్డును ఎల్ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డి ప్రారంభించారు. సెలవుల్లో రూ. 59తో రోజంతా మెట్రోలో తిరగొచ్చని ఆయన చెప్పారు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగొచ్చని సూచించారు. మెట్రో వర్గాలు ప్రకటించిన 100 రోజుల సెలవుల్లో ఈ సూపర్ సేవర్ కార్డు ఉపయోగపడుతుందని కేవీబీ రెడ్డి పేర్కొన్నారు.