HYD Metro | హైదరాబాద్ మెట్రో సేవల్లో అంతరాయం చోటు చేసుకున్నది. అమీర్పేట-మియాపూర్ మధ్య మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. సాంకేతిక సమస్య కారణంగా దాదాపు 20 నిమిషాల పాటు అంతరాయం కలిగింది. సాంకేతిక సమస్యల కారణంగా మెట్రో రైలు 20 నిమిషాల పాటు భరత్నగర్లోనే నిలిచిపోయింది. సేవలకు అంతరాయం కలుగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏప్రిల్ 2న సైతం మెట్రో సేవలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. సాంకేతిక సమస్య కారణంగా నాంపల్లిలో రైలు దాదాపు పావుగంట పాటు నిలిచిపోయింది. ఆ తర్వాత స్పందించిన మెట్రో సిబ్బంది వెంటనే సమస్యను పరిష్కరించడంతో రైలు యథావిధిగా సేవలు కొనసాగాయి.