Hyderabad Metro | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్ల ఛార్జీలు పెరిగాయి. మెట్రో రైలు కనీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 12కు, గరిష్ఠ ఛార్జీ రూ. 60 నుంచి రూ. 75కు పెంచారు. పెరిగిన మెట్రో ఛార్జీలు ఈ నెల 17 నుంచి అమల్లోకి రానున్నాయి. మెట్రో ఛార్జీలు పెంచడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మొదటి 2 కి.మీ. వరకు రూ. 12
2 నుంచి 4 కి.మీ. వరకు రూ. 18
4 నుంచి 6 కి.మీ. వరకు రూ. 30
6 నుంచి 9 కి.మీ. వరకు రూ. 40
9 నుంచి 12 కి.మీ. వరకు రూ. 50
12 నుంచి 15 కి.మీ. వరకు రూ. 55
15 నుంచి 18 కి.మీ. వరకు రూ. 60
18 నుంచి 21 కి.మీ. వరకు రూ. 66
21 నుంచి 24 కి.మీ. వరకు రూ. 70
24 కి.మీ. నుంచి ఆపై దూరానికి రూ. 75
Metro